Rupee Value: ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకున్న రూపాయి విలువ..!
అమెరికా(America) అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trumph) మరోసారి ఎన్నికయ్యాక రూపాయి విలువ(Rupee Value) మరింత క్షీణిస్తూ వస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trumph) మరోసారి ఎన్నికయ్యాక రూపాయి విలువ(Rupee Value) మరింత క్షీణిస్తూ వస్తోంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్(US Dollar) తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. ఈ ఒక్కరోజే మరో 03 పైసలు పడిపోయి ఎప్పుడు లేనివిధంగా 84.94 స్థాయికి పతనమైంది. దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్(Federal Reserv) వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో రూపాయి వాల్యూ బలహీనపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీంతో రూపాయి విలువ మరింత పతనం కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI), కేంద్ర ప్రభుత్వం(Central Govt) చొరవ తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ 2.0 హయాంలో రూపాయి విలువ మరో 8 నుంచి 10 శాతం క్షీణించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పరిశోధన విభాగం తెలిపింది. H1B వీసా పరిమితులు, డాలర్ బలపడటం వంటి అంశాలుతో స్వల్ప కాలానికి రూపాయి కొత్త అస్థిరతను ఉండొచ్చని నివేదిక పేర్కొంది.