Today Gold Rate: ముచ్చటగా మూడో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు..
సాధారణంగా మన ఇంట్లో ఏ శుభాకార్యం జరిగినా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మన ఇంట్లో ఏ శుభాకార్యం జరిగినా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే మన దేశంలో గోల్డ్‌కు ఉన్న డిమాండ్ అటువంటిది కాబట్టి. అందులో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి గోల్డ్‌కి డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. అయితే గత రెండు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా ఐదు వేలకు పైగా పెరిగి షాకిచ్చాయి. అలాగే సిల్వర్ రేట్లు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.250 కు పెరిగి రూ.87,700 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.270 కు పెరిగి రూ.95,670 గా ఉంది. ఇక వెండి ధరలు 2000 వేలు పెరిగి కిలో రూ. 1,10,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,700
24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,670
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,670