భారీగా మద్యం సీజ్
ఎల్లారెడ్డిపేట్ మండలంలోని బండలింగంపెళ్లి గ్రామంలో భారీగా మద్యం సీజ్ చేశారు.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట్ మండలంలోని బండలింగంపెళ్లి గ్రామంలో భారీగా మద్యం సీజ్ చేశారు. కేసరి శ్రీనివాస్ అనే వ్యక్తి చట్టవ్యతిరేకంగా తన గ్రామ శివారులో దాబా నిర్వహిస్తూ అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే సమాచారం మేరకు బుధవారం జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ సదన్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ఎల్లారెడ్డిపేట్ పోలీసులు దాడి చేశారు. రూ. 67 వేల విలువైన మద్యం సీజ్ చేశారు. జిల్లాలో దాబాలు,హోటళ్లలో అక్రమంగా సిట్టింగ్ లు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ప్రోహిబిషనరీ ఎస్ఐ లక్ష్మణ్, టాస్క్ఫోర్స్ సిబ్బంది తిరుపతి, రాజేష్, ఎల్లారెడ్డిపేట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.