ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ మళ్లీ వస్తున్నాడా..?
దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజులో ఐపీఎల్ ప్రారంభం - Sachin Tendulkar is the mentor of the Mumbai Indians team
దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజులో ఐపీఎల్ ప్రారంభం అవుతండటంతో ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్స్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ను తమ తమ జట్లలోకి చేరిపోతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆ జట్టుతో కలిసిపోయాడు. ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సచిన్ హోటల్ గదిలోకి రావడాన్ని చూడవచ్చు.
అయితే సచిన్ ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆరు సీజన్లలో ఆడిన సచిన్ అన్ని సీజన్లన్నింటిలోనూ ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్ అయినప్పటి నుండి ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు.. విజయవంతమైన జట్టుగా నిలవడానికి సచిన్ ఆటగాడిగా, మెంటార్‌గా కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా 78 మ్యాచ్‌లో సచిన్ 33 సగటుతో 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
రోహిత్ శర్మ(16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా(12 కోట్లు), కీరన్ పొలార్డ్(6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(8 కోట్లు), ఇషాన్ కిషన్(15.25 కోట్లు), టిమ్ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్ (ఓవర్సీస్-3 కోట్లు), డేనియల్ సామ్స్ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్ వర్మ(1.70 కోట్లు), మురుగన్ అశ్విన్(1.60 కోట్లు), టైమల్ మిల్స్ (ఓవర్సీస్-1.50 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్ మార్కండే( 65 లక్షలు), సంజయ్ యాదవ్(50 లక్షలు), బసిల్ థంపి(30 లక్షలు), అర్జున్ తెందూల్కర్(30 లక్షలు), ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్( వీరందరికీ 20 లక్షలు).
This arrival video is 𝐒𝐏𝐄𝐂𝐈𝐀𝐋 for so many reasons! 💙🤩#OneFamily #DilKholKe #MumbaiIndians @sachin_rt MI TV pic.twitter.com/IWROqXo2Z9
— Mumbai Indians (@mipaltan) March 24, 2022