Breaking: ఢిల్లీ ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్.. ఆస్పత్రి వద్ద భద్రత పెంపు

ఢిల్లీ ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్ అడ్మిట్ అవడంతో భారీగా పోలీస్ భద్రత పెంచారు...

Update: 2024-12-26 17:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎయిమ్స్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురికావడం, పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్‌లో చేరారు. దీంతో ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిమ్స్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌కు వెళ్లారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ప్రియాంకకు వైద్యులు తెలిపానట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నాయకులు ఎయిమ్స్‌కు భారీగా చేరుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News