Breaking: 9.51 నిమిషాలకు మన్మోహన్‌సింగ్ కన్నుమూత.. ధృవీకరించిన ఎయిమ్స్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు...

Update: 2024-12-26 17:19 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) కన్నుమూశారు. ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌కు(Delhi AIIMS) తరలించారు. దీంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ ఫలితంలేకుండా పోయింది. సరిగ్గా 9.51 నిమిషాలకు ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ కన్నుమూతను ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇక మన్మోహన్ కన్నుమూత విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), జేపీ నడ్డా(JP Nadda) ఆస్పత్రికి వెళ్లారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారతదేశానికి ఆయన రెండు సార్లు ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) తరపున సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ దేశంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు చిరస్థాయిలో నిలిచిపోయాయి. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 


Read More..

Big Breaking News : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత  




Tags:    

Similar News