Karnataka: కర్ణాటకలో కొత్తగా హిందూ పార్టీ..!

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. కర్ణాటకలో కొత్తగా "హిందూ పార్టీ"ని ప్రారంభించే అవకాశాన్ని సూచించారు.

Update: 2025-03-30 14:15 GMT
Karnataka: కర్ణాటకలో కొత్తగా హిందూ పార్టీ..!
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. కర్ణాటకలో కొత్తగా "హిందూ పార్టీ"ని ప్రారంభించే అవకాశాన్ని సూచించారు. కాషాయ పార్టీ బీఎస్ యడ్యూరప్ప వారసత్వ రాజకీయాలకు మద్దతుగా.. రాష్ట్ర అధ్యక్షుడిగా బీ వై విజయేంద్రను కొనసాగించాలని నిర్ణయించుకుని కొత్త పార్టీ పెడతానని హెచ్చరించారు. అయితే, తాను బీజేపీకి గానీ, మోడీకి కానీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. బీజేపీని తాను ఇప్పటికీ "తల్లి"గా భావిస్తున్నానని అన్నారు. తన సహచరులతో కలిసి కొత్త పార్టీ అవసరంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ప్రారంభిస్తామని అన్నారు. కర్ణాటకలో "హిందూ పార్టీ"ని ఏర్పాటు చేయమని రాష్ట్రవ్యాప్తంగా హిందూ కార్యకర్తల నుండి తనకు సందేశాలు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పాలనలో ఇక్కడి హిందువులు సురక్షితంగా లేరని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీ కే శివకుమార్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేతలు"సర్దుబాటు" చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

యత్నాల్ పై సస్పెన్షన్

ఇకపోతే, పార్టీ క్రమశిక్షణను పదే పదే ఉల్లంఘించినందుకు బసంగౌడ పాటిల్ యత్నాల్‌ను బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది. వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ హైకమాండ్‌ను తాను ఇప్పటికీ అభ్యర్థిస్తున్నానని యత్నాల్ అన్నారు. సర్దుబాటు రాజకీయాల్లో మునిగిపోయిన వారిని తొలగించకపోతే బీజేపీపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News