Manmohan singh : మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ఢిల్లీ బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేతలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) కాసేపటి క్రితం కన్నుమూశారు.
దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) కాసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేడు ఢిల్లీలోని ఎయిమ్స్(AIMS) లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మన్మోహన్ మరణ వార్త తెలుసుకొని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. నేడు కర్ణాటకలో బెల్గాంలో జరుగుతున్న CWC మీటింగ్ కు హాజరైన రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) మన్మోహన్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మరోవైపు ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రత పెంచారు.
Read More...
Breaking: ఢిల్లీ ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్.. ఆస్పత్రి వద్ద భద్రత పెంపు