మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుట్టిన గ్రామం.. ఇప్పుడు ఆ దేశంలో ఉంది..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుట్టిన గ్రామం ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది...
దిశ,వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) కన్నుమూశారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్(Panjab) రాష్ట్రంలో గాహ్ గ్రామం(Gah village)లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్‌లో ఉంది. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఆయన సేవలందించారు. దేశాన్ని ఎక్కువకాలం పాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించారు. అంతేకాదు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ మంచి పేరు తెచ్చుకున్నారు. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.