ఉన్నత చదువులతో తలరాతను మార్చుకోండి: ఆర్టీసీ ఎండి సజ్జనార్

దిశ, తొర్రూరు : విద్యార్థులకు పదవ తరగతి ఉన్నత చదువులకు తొలిమెట్టు అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అన్నారు.. Latest Telugu News..

Update: 2022-04-01 15:25 GMT

దిశ, తొర్రూరు : విద్యార్థులకు పదవ తరగతి ఉన్నత చదువులకు తొలిమెట్టు అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల అధ్యయన శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులతో తలరాతలు మార్చుకోవచ్చని, తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని ఇవ్వడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పారు.

సోషల్ మీడియా అనేది మన బలహీనత కాకూడదు అని, ప్రతి ఒక్కదాన్ని తమ సామర్థ్యాన్ని పెంచుకునేందకు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. వీలైనంత వరకు సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. ఏకాగ్రతతో మీ లక్ష్యం మీద దృష్టిని కేంద్రీకరించగలిగితే విజయం మీ సొంతం అవుతుందని అన్నారు. అయితే సజ్జనార్ ముందుగా తొర్రూరు ఆర్టీసీ డిపోను, బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం రవీంద్ర, డి.ఎస్.పి వెంకటరమణ, సిడబ్ల్యుసి చైర్పర్సన్ డాక్టర్ నాగవాని, వందేమాతరం కార్యకర్తలు, కాలం విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News