రూ.15 లక్షలు.. 6 గంటల సమయం..
దిశ, శంషాబాద్ : కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి చెందిన రూ.15 లక్షల నగదుతో కారు డ్రైవర్ ఉడాయించిన
దిశ, శంషాబాద్ : కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి చెందిన రూ.15 లక్షల నగదుతో కారు డ్రైవర్ ఉడాయించిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు తో 6 గంటల్లో కేసును మైలార్ దేవుపల్లి పోలీసులు ఛేదించారు. నిందితున్ని పట్టుకొని రూ.15 లక్షల రూపాయలు రికవరీ చేశారు. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ బూర్గులలోని జ్యోతి స్పిన్నింగ్ మిల్ లో మేనేజర్ గా పనిచేసే జగదీశ్వర్ జీడిమెట్లలో నివాసముంటున్నాడు. కాగా కంపెనీకి చెందిన రూ.15 లక్షల నగదును జీడిమెట్ల నుంచి మహబూబ్ నగర్ కు గతంలో పరిచయం అయిన రాజు అనే వ్యక్తికి చెందిన క్యాబ్ లో బయల్దేరాడు.
ఈ క్రమంలో మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బెంగళూరు జాతీయ రహదారి బుద్వేల్ వద్దకు వచ్చాక మూత్ర విసర్జనకు కారును ఆపాడు. అదే అదునుగా భావించిన కార్ డ్రైవర్ నగదు ఉన్న బ్యాగ్ తో ఉడాయించాడు. బాధితుడు జగదీశ్వర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 6 గంటల్లోగా నిందితుడి కాల్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.15 లక్షల నగదును రికవరీ చేశారు. అద్దె కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి చర్చలు జరపవద్దని డీసీపీ సూచించారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డులను అందజేసి అభినందించారు.