దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 950 అసిస్టెంట్ ఖాళీల పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా జాబ్ చేయాలి.
విద్యార్హత:
కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (SC/ST/PWD అభ్యర్థులకు పాస్ మార్కులు), PC లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం. స్థానిక భాషలో నైపుణ్యం ఉండాలి. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాలు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఫిబ్రవరి 2022
చివరి తేదీ : 08 మార్చి 2022
ఫీజు చెల్లింపు చివరి తేదీ : 08 మార్చి 2022
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 26, 27 మార్చి 2022
పే స్కేల్ : 36091/ నెలకు
ఫీజు:
Gen/EWS/OBC అభ్యర్థులకు రూ.450
SC/ST/PWD/Ex-S అభ్యర్థులకు రూ.50
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ & లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.inలో చూడగలరు.