Beauty Blunder: మేకప్ వేసుకునే బ్యూటీ బ్లెండర్‌ను ఎన్ని డేస్ వాడాలి.. క్లీన్ చేయడమేలా..?
పార్టీలు, ఇంట్లో లేదా బయట శుభకార్యాలకు వెళ్లాలంటే కొంతమంది అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలు, ఇంట్లో లేదా బయట శుభకార్యాలకు వెళ్లాలంటే కొంతమంది అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లో మేకప్‌కు మరింత ప్రిఫరెన్స్ ఇచ్చే అమ్మాయిలు.. ఇందుకోం అనేక ప్రొడక్ట్స్ వాడుతారు. ఇక మేకప్ వేసుకోవడానికి పలు సాధనాలు కూడా ఉపయోగిస్తారు. మేకప్ నీట్‌గా రావడానికి బ్రష్(Brush), బ్యూటీ బ్లెండర్(Beauty Blender), స్పాంజ్(Sponge) వంటివి ప్రతి ఒక్కరి మేకప్ కిట్‌లో ఉండాల్సిందే. ఇందులో అమ్మాయిలు ఉపయోగించేది ఎక్కువగా బ్యూటీ బ్లెండర్. మరీ దీన్ని ఎన్ని రోజలకోకసారి శుభ్రం చేయాలి. క్లీన్ చేయడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యూటీ బ్లెండర్ ఎన్నిరోజులకోకసారి శుభ్రం చేయాలి..?
బ్యూటీ బ్లెండర్ ఎలా క్లీన్ చేయాలో, ఎప్పుడు ఛేంజ్ చేయాలో తెలియక మహిళలు ఆందోళన పడుతారు. అయితే బ్యూటీ బ్లెండర్‌ను మేకప్ వేసుకున్న ప్రతీసారి క్లీన్ చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తరచూ దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు బ్యాక్టీరియా(Bacteria)ను, మేకప్ రెసిడ్యూ సేకరిస్తుంది. దీంతో స్కిన్‌కు హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి.
ఎలా క్లీన్ చేయాలి..?
బ్యూటీ బ్లెండర్‌ను 20 నిమిషాల పాటు వాటర్‌లో నానబెట్టాలి. దీంతో మేకప్ అవశేషాలన్నీ వాటర్‌లోకి వెళ్లిపోతాయి. అనంతరం బ్లెండర్‌ను గట్టిగా రుద్దకుండా.. కాస్త సున్నితంగా నలుపుతూ క్లీన్ చేయాలి. వీలైతే షాంపూ వాటర్‌తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ బ్యూటీ బ్లెండర్ పై మొండి మరకలు కనుక ఉంటే.. వాటిని తొలగించేందకు సిలికాన్ స్క్రబ్ పై సున్నితంగా రుద్ది.. వాటర్‌తో కడగండి.
అలాగే సోప్‌తో కూడా బ్యూటీ బ్లెండర్‌ను క్లీన్ చేయవచ్చు. కానీ గట్టిగా రుద్దవద్దు. దీనికి సెపరెట్ గా మేకప్ బ్రష్ క్లీనర్ కూడా మార్కెట్‌లో దొరుకుతుంది.బ్లెండర్‌ను క్లీన్ చేశాక వెలుతురు ఉన్న ప్లేస్‌లో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరాకనే మేకప్ బ్యాగ్‌లో పెట్టాలి. లేకపోతే దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బ్యూటీ బ్లెండర్‌ను ఎప్పుడు ఛేంజ్ చేయాలి..?
బ్లెండర్‌ను ఎక్కువ డేస్ వాడడం చర్మానికి మంచిది కాదు. కాగా మూడు నెలలకు ఒకసారి మార్చితే సరిపోతుంది. తర్వాత కొత్తది కొనండి. అలాగే సమయం గడవకున్నా.. బ్లెండర్ స్పాంజ్‌పై డ్యామేజ్ అయినట్లు కనిపిస్తే మార్చండం మేలు. అలాగే దాని కలర్ పోయినప్పుడు, చెడు వాసన వస్తే, ముక్కలు ముక్కలుగా ఉడిపోతున్నట్లైతే, మిస్టేక్‌లో కట్ అయితే కొత్త బ్యూటీ బ్లెండర్‌ను కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.