భీమ్లా నాయక్ సీక్వెల్‌పై రానా క్లారిటీ

Update: 2022-03-04 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన సినిమా 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. మొదటి రోజు భారీ కలెక్షన్లతో రఫ్ఫాడించింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే 'భీమ్లా నాయక్' సీక్వెల్. డైరెక్టర్ సాగర్, పవన్ కల్యాన్ 'భీమ్లా నాయక్' సీక్వెల్‌పై చర్చిస్తున్నారని, దాదాపు ఇది ఖారారైందంటూ టాక్ నడిచింది.

తాజాగా దీనిపై రానా క్లారిటీ ఇచ్చాడు. ప్రెస్ మీట్ పాల్గొన్న రానా దీనిపై స్పందించాడు. 'భీమ్లా నాయక్' సీక్వెల్ ఉంటుందా అన్నప్రశ్నకు రానా ఇలా సమాధానం ఇచ్చాడు. 'భీమ్లా నాయక్'కు సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ సినిమా కథ ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడ పూర్తయింది' అని రానా బదులిచ్చాడు. దీంతో 'భీమ్లా నాయక్' సీక్వెల్ లేదని క్లారిటీ వచ్చేసింది.

Tags:    

Similar News