కొడుకుతో క్యూట్ ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్ బ్యూటీ.. వావ్ సో క్యూట్ అంటున్న నెటిజన్స్

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-16 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్- అమలాపాల్ కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది ఈ అమ్మడు. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. కానీ, మధ్యలో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రావడం తగ్గడంతో తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయింది. అక్కడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్‌ను ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అలా మూడేళ్ల పాటు హ్యాపీగా ఉన్న వీరు.. 2019లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే డివోర్స్ తీసుకున్న వెంటనే ఆ ఏడాదే దర్శకుడు ఇంకో వివాహం చేసుకున్నాడు. కానీ, అమలాపాల్ ఆ బాధ నుంచి బయట పడటానికి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. తర్వాత వెబ్‌సైట్లో ఉన్న జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడి గత ఏడాది మ్యారేజ్ చేసుకుంది.

అలా పెళ్లి చేసుకున్న వీరికి ఇటీవల ఇలై అనే బాబు కూడా జన్మించాడు. అయితే తాజాగా ఆ బాబుతో ఉన్న ఫొటోలను ఈ భామ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘వావ్ సో క్యూట్’, ‘బ్యూటీఫుల్’, ‘నైస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

Full View

(PHOTOS LINK CREDITS TO AMALAPAUL INSTAGRAM ID)


Similar News