తాగునీటిలో యురేనియం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఆ 6 జిల్లాల్లో మోగుతున్న డేంజర్ బెల్స్!
అణు విద్యుత్ తయారీ కోసం న్యూక్లియర్ ప్లాంట్లలో వినియోగించే యురేనియం గ్రౌండ్ వాటర్‌లో పూర్తి స్థాయిలో కలిసినట్లు తాజా పరిశోధనలో తేలింది. దీని వలన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో : అణు విద్యుత్ తయారీ కోసం న్యూక్లియర్ ప్లాంట్లలో వినియోగించే యురేనియం గ్రౌండ్ వాటర్‌లో పూర్తి స్థాయిలో కలిసినట్లు తాజా పరిశోధనలో తేలింది. దీని వలన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని దుర్గ్, రాజ్‌నంద్‌గన్, కాంకేర్, బెమెతర, బలోడ్, కవర్ధ జిల్లా్ల్లోని ఒక లీటరు తాగు నీటిలో 100 మైక్రోగ్రామ్స్ ప్రమాదకరమైన యురేనియం స్థాయిలు బయటపడినట్లు వెల్లడైంది. 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం లీటర్ తాగునీటిలో 15 మైక్రోగ్రాముల కంటే యురేనియం స్థాయిలు అధికంగా ఉండరాదు.
ఇక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గతంలో యురేనియం స్థాయి పరిమితిని 30 మైక్రోగ్రాముల వరకు పెంచింది. ఇటీవల జూన్ నెలలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం మేరకు లీటరు తాగునీటిలో 60 మైక్రోగ్రాముల యురేనియం స్థాయిలు సైతం సురక్షితమని తేల్చింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 100 నుంచి 130 మైక్రోగ్రాముల మేర యురేనియం స్థాయిలను గుర్తించారు. ముందుగా బలోడ్ జిల్లాలోని దేవరాత్రి గ్రామంలో గల 25 ఏళ్ల కిందటి బోర్‌వెల్ నుంచి డ్రింకింగ్ వాటర్‌ను రెండు సార్లు పరీక్షించగా అందులో యురేనియం మైక్రోగ్రామ్స్ అధిక మొత్తంలో వెలుగుచూసినట్లు ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విభాగం గుర్తించింది. ప్రస్తుతం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు సమాచారం.