Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (23-10-2024)

నేడు మేష రాశి వారు ఎక్కువగా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు.

Update: 2024-10-22 21:45 GMT

మేష రాశి: నేడు మేష రాశి వారు ఎక్కువగా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు. డబ్బుల విషయంలో జాగ్రత్త పడాలి. మిమ్మల్ని ఖర్చులు బాధిస్తతాయి. ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. నేడు మీకు నచ్చిన పనులు చేస్తారు.

వృషభ రాశి:ఇతరులకు సహాయం చేయండి. ఇతరులను ఎక్కువ నమ్మకండి. మీరు అన్ని నిజాలు చెప్పరు. కాగా సమస్యల్లో పడే అవకాశం ఉంది. నేడు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి.ఉద్యోగంలో అంతా సవ్యంగానే ఉంటుంది. చదువుపట్ల శ్రద్ధ చూపిస్తారు.

మిథున రాశి: ఇవాళ ఈ రాశివారు ఎక్కువగా ఆటల్లో ఆసక్తి చూపుతారు. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. కానీ మీ డబ్బు ఇతరులు దొంగిలించే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటక రాశి: నేడు మీ జీవిత భాగస్వామితో గొడవ పడుతారు. మీ సోదరుడు మిమ్మల్ని మూడ్ ఆఫ్ చేస్తాడు. కానీ ఆలోచించి పరిష్కారం వెతుకుతారు. ఇవాళ మనస్ఫూర్తిగా నవ్వండి. వీరు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. పాత స్నేహితులతో గడపడానికి సమయం దొరుకుతుంది.

సింహ రాశి: మీ ఫ్రెండ్స్ మీరు ఆపదలో ఉంటే ఆదుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ లైఫ్ లో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. సెమినార్లు, ఉపన్యాసాల్లో పాల్గొంటారు.

కన్యా రాశి: మనీ ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల సపోర్ట్ బాగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపార విషయాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి.

తులా రాశి: ఆరోగ్యం బాగుంటుంది.రోజంతా నవ్వుతూ గడుపుతారు. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. కానీ ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి వ్యతిరేకత వస్తుంది.

వృశ్చిక రాశి: పూర్తిగా మీ దృష్టి మీరు చేసే పనులపైనే పెట్టండి. లాభాలన్నీ మీ దరి చేరుతాయి. మీ భాగస్వామి మాటలకు లొంగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం ముఖ్యం. ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి అపారమైన ప్రేమ చూపిస్తారు.

ధనుస్సు రాశి: ప్రయాణాలు ఎక్కువగా చెయొద్దు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడే అవకాశం ఉంది. తొందరగానే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. మీ జీవిత భాగస్వామితో పలు విషయాల్లో గొడవ పడతారు.

మకర రాశి: మీ జీవితంలోని పలు సమస్యల కారణంగా మీ సంతోషం దూరం అవుతుంది. మీ స్వంత ఆలోచనల్ని మాత్రమే వాడండి. మీరు ప్రశాంతంగా ఉందామనుకున్నప్పుడే ఆర్థిక విషయాల్లో మీ భాగస్వామితో గొడవలు తలెత్తుతాయి. బంధువులు ఇంటికి వస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు వెళ్తారు.

కుంభ రాశి: నేడు ఈ రాశి వారు ఒత్తిడికి గురవుతుంటారు. బాడీ పెయిన్స్ వస్తాయి. ఆర్థికంగా ప్రయోజనాలు అందుకుంటారు. ఇతరుల వద్ద అస్సలు మొహమాటపడొద్దు. ఈ రోజు ఎక్కువగా సినిమాలు చూడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. వైవాహిక జీవితంలో అంతా బాగుంటుంది. ఎక్కువగా పార్కులో గడపడానికి ఇష్టపడతారు.

మీన రాశి: చిన్ననాటి స్నేహితులతో గడుపుతారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ సమయాన్ని వృథా చేయవద్దు. విలాసవంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు. ఫ్రెండ్స్‌తో సాయంత్రం పూట సమయం గడుపుతారు. కానీ గొడవలు రాకుండా చూసుకోండి.వైవాహిక జీవితం అంతా బాగుంటుంది. పెద్దల సలహాలు తీసుకోండి.


Similar News