ఫ్యూయల్ ట్యాంకులు నింపుకొండి.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్

న్యూఢిల్లీ: సోమవారంతో ఎన్నికలు ముగియనుండడంతో కేంద్రం ఇంధన ధరలు..latest telugu news

Update: 2022-03-05 14:49 GMT

న్యూఢిల్లీ: సోమవారంతో ఎన్నికలు ముగియనుండడంతో కేంద్రం ఇంధన ధరలు పెంచుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'వెంటనే మీ ఫ్యుయల్ ట్యాంకులు నింపుకొండి. మోడీ ప్రభుత్వం ఎన్నికల ఆఫర్ ముగియనుంది' అని ప్రజలనుద్దేశించి ట్వీట్ చేశారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100డాలర్లకు పైగా ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. వచ్చే వారం ఇంధన ధరలు పెరగొచ్చని పలువురు నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. 'సోమవారంతో ఎన్నికలు ముగియనుండడంతో ఇంధన ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరగడం ప్రారంభమవుతాయి' అని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపనీ జేపీ మోర్గాన్ అన్నారు.

Tags:    

Similar News