సీఎంగా రెండోసారి పుష్కర్ ధామి ప్రమాణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. latest telugu news..
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్ పుష్కర్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజధాని డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్ వేడుక కాగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా హాజరయ్యారు.
సీఎం ధామితో చందన్ రామ్‌దాస్, సౌరభ్ రావత్, ప్రేమ్‌చంద్ అగర్వాల్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, ఐదు రాష్ట్రాలకు సంయుక్తంగా జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 47 చోట్ల ఘన విజయం సాధించింది. తన సొంత నియోజకవర్గం ఖటిమాలో పుష్కర్ ధామి ఓటమి పాలవ్వగా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిపై ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన పుష్కర్ సింగ్ ధామికే బీజేపీ అగ్రనాయకత్వం మరోసారి సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించింది.