'రాహుల్ గాంధీది న్యూసెన్స్.. రేవంత్ రెడ్డిది నాన్సెన్స్'

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-03-29 10:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో RRR - కాంగ్రెస్‌లో RR లు అనే దరిద్రాలు మోపయ్యాయని మండిపడ్డారు. లోపల ముద్దులాట- బయట గుద్దులాట ఆడుతూ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేశారని గుర్తుచేశారు. లోపల స్వీట్లు పంచుకుంటూ, బయట ట్వీట్లు చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి ఓట్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశంలో ఐరన్ లెగ్ అని యూపీ, పంజాబ్‌ ఎన్నికల్లో అడుగుపెట్టగానే అధికారం కోల్పోయాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్‌ పార్టీలో ఐరన్ లె‌గ్‌లు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీది ఒక న్యూసెన్స్ -  రేవంత్ రెడ్డి ఒక నాన్సెన్స్ అని అభిప్రాయప్డడారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక గాంధీ భవన్‌ను కుస్తీ భవన్‌గా మార్చారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News