స్టూడెంట్స్ చేత వసూళ్లు చేయిస్తున్న స్కూల్.. సర్వత్రా చర్చ
దిశ, వేములవాడ టౌన్: గ్రావిటీ ఇన్నోవేషన్ ఫెస్టివల్ పేరిట ఇన్నోవేటివ్ ప్రోగ్రాంకు..Private School Over action in Vemulawada
దిశ, వేములవాడ టౌన్: గ్రావిటీ ఇన్నోవేషన్ ఫెస్టివల్ పేరిట ఇన్నోవేటివ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. విద్యార్థులకు రశీదు పుస్తకాలు ఇచ్చి డబ్బులు వసూలు చేయాలని సూచించిన వైనంపై చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యం గ్రావిటీ ఇన్నోవేషన్ ఫెస్టివల్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పాఠశాలలో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఫెస్టివల్ పేరిట చందా బుక్కులు ఇచ్చి వారిచే స్కూల్ యాజమాన్యం నిర్వహించే ఫెస్టివల్ కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులచే చందాలు వసూలు చేయిస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శస్తున్నారు స్థానికులు. అంతేకాకుండా గోల్డ్ కాయిన్ తో పాటు తొమ్మిది ప్రైజులను కూడా గెల్చుకొండంటూ ఆ రశీదులో ముద్రించడం గమనార్హం. చందాల వసూళ్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా లాటరీ పద్ధతిని అవలంభిస్తామని స్కూల్ యాజమాన్యం బాజాప్తాగా రశీదు పుస్తకాల్లో ముద్రించడం గమనార్హం.
విద్యార్థులచే డబ్బులు వసూలు చేయించరాదు: ఎంఈఓ బన్నాజీ
వేములవాడ పట్టణంలోని ప్రేవేటు స్కూల్ యాజమాన్యం చేయిస్తున్న వసూళ్లపై విచారణ చేయిస్తా. ఈ వ్యవహారంపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదు.