పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ.. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్‌లో హాట్ కామెంట్స్

Update: 2022-03-03 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ముంబైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు ఈ ఈవెంట్‌తో తన పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో కూడా చెప్పేశాడు.

'ప్రేమపై మీ అంచనా అంత కరెక్ట్‌గా లేదని సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. నిజ జీవితంలో మీ అంచనాలేమిటి?' అని ప్రభాస్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. ఫన్నీగా రిప్లై ఇచ్చిన ప్రభాస్.. 'నా ప్రేమ అంచనాలు ఎప్పుడూ తప్పాయి.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ నుంచి ఈ ఫన్నీ సమాధానం చాలా మందిని ఆకట్టుకుంది. దీంతో అందరూ ప్రభాస్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఇక, రాధే శ్యామ్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు ప్రభాస్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు.

https://youtu.be/1THmlR-dIq0

Tags:    

Similar News