ఆ దేశ ప్రధానితో భారత ప్రధాని మోడీ భేటీ.. భవిష్యత్ కార్యాచరణ గురించే..
దిశ, వెబ్‌డెస్క్: దేశ భవిష్యత్ కోసం మోడీ అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులతో చర్చలు చేస్తున్నారు. ఇందులో
దిశ, వెబ్‌డెస్క్: దేశ భవిష్యత్ కోసం మోడీ అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులతో చర్చలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భరత్ పొరుగు దేశం నేపాల్ ప్రధానితోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల భవిష్యత్తుకు సంబంధించి చర్చించారు. న్యూ ఢిల్లీ షేర్ బహదుర్ దగ్గర్లోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానులు భేటి అయ్యారు. ఈ సమావేశం గురించి మోడీ మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్‌ల ప్రొగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఫ్యూచర్ బ్లూ ప్రింట్ గురించి చర్చించాం' అని అన్నారు. అనంతరం ఇరుదేశాల ప్రధానులు కలిసి బిహార్‌లోని జేనగర్, నేపాల్ కుర్తా మధ్య ఓ రైల్వే నెట్వర్క్‌ను స్థాపించేందుకు నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.