పాక్ ప్రధానికి మరో దెబ్బ.. వార్నింగ్ ఇచ్చిన లీగల్ వింగ్
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ ప్రధాని వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే తిరుగుబాటు
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ ప్రధాని వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే తిరుగుబాటు, గద్దె దించేందుకు తీవ్ర ప్రయత్నాలతో ఇమ్రాన్ ఖాన్ సతమతమవుతున్నారు. అయితే తాజాగా ఇమ్రాన్‌కు పాకిస్తాన్ న్యాయ విభాగం మరో షాక్ ఇచ్చింది. దేశ రహస్య సమాచారాన్ని బయటపెడుతున్నాడని ఇమ్రాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్య సమాచారానికి సంబంధించిన ఫైల్లను బయటకు పంపుతున్నారని దీని వల్ల ఇమ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది. పార్లమెంట్ మెంబర్ పదవి నుంచి జీవిత కాల నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపినట్లు సమాచారం.
అయితే పాకిస్తాన్ రాయబారి ద్వారా ఓ దేశం హెచ్చరికలు జారీ చేసిందని, ఆ విషయంపై ఇమ్రాన్ ఖాన్ లీగల్ వింగ్‌ను సలహా కోరాడని సమాచారం. దీంతో దేశ న్యాయ విభాగం ఇమ్రాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. దేశ అధికారిక రహస్యాల చట్టం 1973 కిందకు వచ్చే దౌత్యపరమైన రహస్యాలకు ఇతరులతో పంచుకోవద్దని, తద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ ప్రధాన మంత్రి ఎప్పుడైనా ఇటువంటి పనులు చేస్తే ప్రమాణ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, అనంతరం అతడిని దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(f) ప్రకారం పార్లమెంట్ సభ్యుడిగా జీవితకాలంపాటు తొలగించడం జరుగుతుందని తెలిపినట్లు తెలుస్తోంది.