Agnipath: 'అగ్నిపథ్' అల్లర్ల ఎఫెక్ట్ .. ఆ సెంటర్లలో వారికి నో ఎంట్రీ
No Admission for Agnipath Protesters, Says Kerala Defence Coaching Centres| అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నుంచి నెమ్మది నెమ్మదిగా మద్దతు వస్తుంది. అగ్నిపథ్ పథకం కు వ్యతిరేకంగా
దిశ, వెబ్డెస్క్: No Admission for Agnipath Protesters, Says Kerala Defence Coaching Centres| అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నుంచి నెమ్మది నెమ్మదిగా మద్దతు వస్తుంది. అగ్నిపథ్ పథకం కు వ్యతిరేకంగా అల్లర్లు సృష్టిస్తున్న వారికి అగ్నివీర్ రిక్యూట్మెంట్లో స్థానం కల్పించమబోమని రక్షణ మంత్రిత్వ శాఖ అదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కేరళలోని చాలా డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారికి తమ సెంటర్లో అడ్మిషన్ లభించదని తేల్చి చెప్పారు. "ఎలాగైనా నిరసనకారులు ఆర్మీకి అనర్హులు అవుతారు.. కాబట్టి ఆ సీటు ఎందుకు వృధా చేస్తారు?" అని ఒక కోచింగ్ సెంటర్ అభిప్రాయ పడింది. అలాగే కేరళ వ్యాప్తంగా మరి కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.