Pragathi Bhavan వద్ద టెన్షన్ టెన్షన్
New Democracy Protest At Pragathi Bhavan Over Farmers Issues| సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూములకు సీఎం పట్టాలివ్వాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సోమవారం న్యూ డెమోక్రసీ శ్రేణులు ప్రగతిభవన్ ను ముట్టడించాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : New Democracy Protest At Pragathi Bhavan Over Farmers Issues| సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూములకు సీఎం పట్టాలివ్వాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సోమవారం న్యూ డెమోక్రసీ శ్రేణులు ప్రగతిభవన్ ను ముట్టడించాయి. ప్రగతిభవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బృందాలను బందోబస్తుగా ఏర్పాటు చేసినా, ఆ వలయాలను ఛేదించి గేటు వద్దకు చేరుకుని పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు న్యూ డెమోక్రసీ నాయకులు. దీంతో పోలీసులకు, డెమోక్రసీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం న్యూడెమోక్రసీ కార్యకర్తలు మాట్లాడుతూ.. పోడు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న పోడు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఇది కేవలం మొదటి దఫా ఆందోళన మాత్రమే అని, ఇంకా పలు దఫాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తాయని తెలిపారు.