హైదరాబాద్ కంపెనీతో అమెరికాలో మీటింగ్.. కేటీఆర్‌పై నెటిజన్ల కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు- latest Telugu news
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు కేటీఆర్ అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే.. సోమవారం ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ 'కెమ్ వేద' ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీనితో వారు తెలంగాణలో తమ కంపెనీని విస్తరించేందుకు రూ.150కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈక్రమంలో దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అయితే కేటీఆర్ అమెరికాలో 'కెమ్ వేద' కంపెనీ ప్రతినిధులను కలిసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న కెమ్ వేద కంపెనీకి చెందిన సభ్యులను కలవడానికి కేటీఆర్ అమెరికా వరకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పర్యటనలతో ప్రజాధనాన్ని ఎలా వృధా చేయాలో వీరి నుండి నేర్చుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.