ఊహించని విశ్వం.. ఫొటో షేర్ చేసిన నాసా..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఎప్పటికప్పుడు అంతరిక్షంలో..

Update: 2022-07-08 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఎప్పటికప్పుడు అంతరిక్షంలో జరిగే మార్పులు అది గమనిస్తూనే ఉంటుంది. అయితే పరిశోధనలో భాగంగా తాజాగా నాసా ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్‌ జేమ్స్ వెబ్ స్పేస్‌లోని ఫైన్ గైడెన్స్ సెన్సార్‌తో అంతరిక్షం ఫొటోను తీసింది. ఈ ఫొటోను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో పాటుగా విశ్వం ఊహించని చిత్రం అని ఫొటో కింద రాసుకొచ్చింది. 'ఓవర్ అచీవర్ గురించి మాట్లాడండి.. ఈ ఫొటోను ఒక్కసారి చూడండి.. విశ్వం యొక్క ఊహించని చిత్రం' అని రాసుకొచ్చింది. అంతేకాకుండా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో చిత్రీకరించే కలర్ ఫొటోలను తొలిసారి వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు నాసా వెల్లడించింది. ప్రస్తుతం నాసా విడుదల చేసిన అంతరిక్షం ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సినిమాల్లో చూసినట్లు అంతరిక్షం అద్భుతంగా ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దాంతో పాటుగా కలర్ ఫొటో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, చెప్పినట్లు వచ్చే వారం ఫొటోలను విడుదల చేయాలంటూ నాసాను కోరుతున్నారు. మరి వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి.


Similar News