Nara Rohit – Siree Lella: నేడే హీరోయిన్‌తో హీరో నిశ్చితార్థం.. హాజరు కానున్న ముఖ్యమంత్రి!

టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-13 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో సోలో, బాణం, ప్రతినిధి రౌడీఫెలో వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. కారణం ఏంటో తెలియదు కానీ.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. రీసెంట్‌గానే ప్రతినిధి-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అద్భుతంగా నటించి.. తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అలాగే రోహిత్ త్వరలో సుందరకాండ చిత్రంతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే నేడు ఈ హీరో నిశ్చితార్థం జరుగుతుందని సమాచారం. మరీ రోహిత్ పెళ్లాడబోయేది ఎవరో కాదు.. మన టాలీవుడ్ హీరోయినే. నారా రోహిత్ తో ‘ప్రతినిధి’ సినిమాలో నటించిన సిరి లేళ్ల. ఈ సినిమా షూటింగ్ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఈ బ్యూటీకి రోహిత్ కు ఇవాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని టాక్. అయితే నారా రోహిత్ అండ్

సిరి లేళ్ల నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు- భువనేశ్వరి హాజరవ్వనున్నారట. వీరితో పాటు నారా అండ్ నందమూరి ఫ్యామిలీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేయనున్నారట. ఇక నారా చంద్రబాబు నాయుడు- భువనేశ్వరి.. హీరో రోహిత్‌కు స్వయనా పెద్దమ్మ- పెద్దనాన్న అవుతారన్న విషయం తెలిసిందే.


Similar News