YO! 10 Prema kathalu: నంది అవార్డ్ గ్రహీత డైరెక్షన్‌లో సరికొత్తగా ‘YO! 10 ప్రేమకథలు’

యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్‌గా రాబోతున్న సరికొత్త చిత్రం ‘YO! 10 ప్రేమకథలు’.

Update: 2024-10-28 14:38 GMT

దిశ, సినిమా: యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్‌గా రాబోతున్న సరికొత్త చిత్రం ‘YO! 10 ప్రేమకథలు’ (YO! 10 Prema kathalu). పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత (Nandi Award winner) మనోహర్ చిమ్మని (Manohar Chimmani) రూపొందించనున్నారు. ఈ చిత్రంలో పది మంది పాపులర్ (Popular) హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. మనోహర్ చిమ్మని సినిమా స్క్రిప్టు (script) రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. ఇప్పుడు ఈయన ‘YO! 10 ప్రేమకథలు’ తెరకెక్కిస్తుండగా.. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది (started). ప్రముఖ దర్శకులు వీరశంకర్ (Veera Shankar), చంద్రమహేశ్ (Chandramahesh) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్‌పై క్లాప్ కొట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ సినిమాకు ఆల్ ది బెస్ట్ (All the best) చెప్పారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..