Regina Cassandra: ఆ పని చేస్తూ అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాను.. రెజీనా షాకింగ్ కామెంట్స్!
యంగ్ బ్యూటీ రెజీనా(Regina Cassandra) తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రెజీనా (Regina)తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన చాన్సులు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ‘ఉత్సవం’ మూవీతో అలరించిన రెజీనా.. ప్రజెంట్ తమిళ నటుడు అజిత్ కుమార్ నటిస్తున్న విడాముయర్చి(Vidaamuyarchi)లో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే రెజీనా(Regina) గత కొద్ది రోజులుగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పర్సనల్ విషయాలు వెల్లడిస్తోంది. తాజాగా, ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఇందులో ఓ నెటిజన్ చేయకూడని పని చేస్తూ తల్లిదండ్రుల వద్ద ఎప్పుడైనా దొరికిపోయారా? అని అడగ్గా.. దీనికి రెజీనా స్పందిస్తూ.. ‘‘ఒకసారి పక్క ఇంట్లో ఏదో జరుగుతుంది. అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూడాలని ఇంటిలోకి తొంగి చూస్తుండగా మా అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాను. అప్పుడు మా అమ్మ నన్ను అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొచ్చి గట్టిగానే చివాట్లు పెట్టింది. అంతేకాకుండా ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని హెచ్చరించింది’’ అని సమాధానమిచ్చింది. ప్రజెంట్ రెజీనా(Regina) కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.