సూర్యాపేటను అందమైన పట్టణంగా అందిస్తాం: మంత్రి

దిశ, సూర్యా పేట: సూర్యాపేట పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

Update: 2022-03-08 15:51 GMT

దిశ, సూర్యా పేట: సూర్యాపేట పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో సూర్యాపేట పట్టణ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని భవిషత్తు తరాలకు అందమైన పట్టణంగా అందిస్తామని అన్నారు. రాష్టం ఏర్పడిన తర్వాత పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నదని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 1982లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ నేటికీ అమలులో ఉండటం, గత పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పేటలో రోడ్లు సరిగా లేవని, మాస్టర్ ప్లాన్‌ను సరిచేసుకొని భవిషత్తు తరాలకు సుందరమైన పట్టణాన్ని అందిద్దామన్నారు.

సూర్యాపేట పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రజాప్రతి నిధులకు, అధికారులకు, వ్యాపార, వాణిజ్య వర్గాల వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పురపాలక పరిపాలన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, అడిషినల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్ట కిషోర్, ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News