హైదరాబాద్‌లో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. వార్షిక వివరాలు చూస్తే షాకే..?
పండుగల శోభాయాత్రలతో మొదలైన 2024 సంవత్సరం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా పోలీసు విధులు కొనసాగాయని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు..
దిశ, తెలంగాణ బ్యూరో: పండుగల శోభాయాత్రలతో మొదలైన 2024 సంవత్సరం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా పోలీసు విధులు కొనసాగాయని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక వివరాలు ఆదివారం వెల్లడించారు. శ్రీరామనవమి బందోబస్త్, హనమాన్ జయంతి, బక్రీద్, మిలాద్ మహంకాళీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
4,042 సైబర్ క్రైమ్ కేసులు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంలో 4,042 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయబడ్డాయని, రూ.296,32,49,996లు సైబర్ క్రైమ్ ద్వారా బాధితులు నష్టపోయారని, సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన 500 మంది క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి వారు ఎక్కువగా రాజస్ధాన్, గుజరాజ్ సౌత్ ఇండియా నుంచి పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన నేరాలలో 7 కేసులలో ఏడుగురు నేరస్థులకు జీవిత ఖైదు, 8 కేసులలో 8 మంది నేరస్థులకు 20 సంవత్సరాల కఠిన కరాగార శిక్ష, రెండు కేసులలో ఇద్దరి నేరస్థులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 43 కేసులలో 51 మందికి 3 సంవత్సరాల శిక్ష విధించబడినట్లు తెలిపారు. డయల్ 100 ద్వారా ఇది 7 నిమిషాలలో స్పాట్‌లో ఉండేలా చర్యలు చేపట్టమన్నారు. ఇది వరకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదన్నారు. మొబైల్, టూ వీలర్ దొంగతనాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు.
58 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశామని, ఏసీబీకి 30 మంది ప్రభుత్వ అధికారులు పట్టుబడినట్లు తెలిపారు. రియల్టర్లకు సంబందించి కస్టమర్లను మోసం చేసిన ఫిర్యాదులపై భువన తేజ్, ధన్వంతరి సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ సంస్ధలలో పనిచేసి కస్టమర్లను మోసానికి గురిచేసిన ఏజెంట్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డ్రంక్ డ్రైవ్‌లలో 59వేల కేసులు నమోదైనట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెజరి హంట్ అంటూ చేస్తున్న వీడియోలపై నిఘా ఉంచామని, ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామన్నారు. సోషల్ మీడియా వేదికగా జరిగే న్యూసెన్స్‌పై ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వార్షిక నివేదికలో వెల్లడించిన క్రైమ్ వివరాలు..
కేసులు 2024 2023
సాధారణ కేసులు
(బీఎన్ఎస్+ఎఎల్ఎల్+నాన్ బీఎన్ఎస్) 35,944 25,488
సాధారణ కేసులు
(బీఎన్ఎస్+ఎఎల్ఎల్) 28,005 23,708
క్రైమ్ కేసులు 8,447 5,098
ప్రాపర్టీ క్రైమ్ కేసులు 5,328 3,551
మహిళలపై దాడి కేసులు 2,482 2,424
పోక్సో కేసులు 449371
ఎస్సీ,ఎస్టీ కేసులు 175172
క్రిమినల్ కేసుల వివరాలు..
హత్య కేసులు 7789
హత్యాయత్నం కేసులు 214274
సాధారణ గాయాల 2,175 1,714
అల్లర్ల కేసులు 1917
చిన్నారుల హత్య కేసులు 26 09
భాదించబడ్డ కేసులు 74110
కిడ్నాపింగ్ కేసులు 324172
చీటింగ్ కేసులు 5,303 5,250
ప్రాపర్టీ ఆఫెన్సెస్ కేసులు..
ఆస్తి కోసం జరిగిన హత్య కేసులు 62
దోపిడీ 219 101
చైన్ స్నాచింగ్ 24 35
డైవర్టింగ్ అటెన్షన్ 244160
ఇంటి దొంగతనం 859547
దారి దోపిడీ 2916
ఇంటీని కొల్లగొట్టుట 435 365
సూడో పోలీస్ 11
ఆటోమొబైల్ 2,0911,470
పనివారి దొంగతనం 173116