మరోసారి ప్రేమను చాటిన మంత్రి హరీష్ రావు.. వారితో ఆత్మీయ ఆలింగనం
దిశ, చిన్నశంకరంపేట : మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సందర్భంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక
దిశ, చిన్నశంకరంపేట : మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సందర్భంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ వెళ్తూ చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆగారు. మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను చిన్న శంకరంపేట టీఆర్ఎస్ నాయకులు దర్జీ శివుడు మంత్రి హరీష్ రావుకు శాలువాతో సన్మానం చేస్తుండగా ఆదే శాలువాని మంత్రి తీసుకొని శివునికి సత్కరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఈ సంఘటనతో నాయకులపై ఉన్న ప్రేమను మరొకసారి మంత్రి హరీష్ రావు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, స్థానిక సర్పంచ్ కొల్కూరి రాజిరెడ్డి, జీవన్, జంగరాయి సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ప్రభాకర్, సాలిపేట సర్పంచ్ పోచయ్య, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, నాయకులు రవీందర్, బాగారెడ్డి, బండారు స్వామి, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, టీఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షరాలు ఎరుకల గంగా, చిన్న రమేష్ గౌడ్, లక్ష్మా గౌడ్, శేఖర్ గౌడ్, వార్డు మెంబర్ సందీప్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.