‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు’.. నా ఎవర్ గురు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా: మెగాస్టార్

నిన్న(అక్టోబరు 28) మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ

Update: 2024-10-29 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిన్న(అక్టోబరు 28) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఏఎన్నార్ నేషనల్ అవార్డు(ANR National Award) సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ వేదికన ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి(Akkineni Nageswara Rao Centenary) సంవత్సరంలో నా ఎవర్ గురు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన 'ఏఎన్నార్ జాతీయ అవార్డు' అందుకోవడం అదృష్టంగా, ఆనందంగా ఉంది. అక్కినేని కుటుంబంలోని ప్రతి సభ్యుడికి, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సభ్యులకు(ముఖ్యంగా) కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరుడు, మిత్రులు టి.సుబ్బరామిరెడ్డి(T. Subbarami Reddy,)కి, నాగార్జున(Nagarjuna)కు ధన్యవాదాలు. నా సినీ ప్రయాణానికి, నా ప్రతి మైలురాళ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను’. అంటూ టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు. ఈ అవార్డు అందుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని కార్యక్రమంలో చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. చిరు ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ అండ్ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ వయసులో కూడా సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మరింత ఫేమ్ దక్కించుకుంటున్నారు చిరు. 

Tags:    

Similar News