ఇక మాస్క్ అవసరం లేదు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర..telugu latest news
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. మరాఠీ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కొవిడ్ సంబంధిత నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంవో ట్వీట్ చేసింది. 'మరాఠీ నూతన సంవత్సరం గుడి పడ్వాను పురస్కరించుకుని, అన్ని కొవిడ్ నిబంధనలు మహారాష్ట్రలో ఎత్తివేస్తున్నాం' అని ట్వీట్ చేశారు. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుడిపడ్వా నుంచి విపత్తు నిర్వహణ చట్టం, మహమ్మారి అంటువ్యాధుల చట్టం కింద ఉన్న నిబంధనలు వెనక్కి తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అన్నారు.