BRS: ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? కేటీఆర్ సంచలన ట్వీట్
ఇదేనా రేవంత్(CM Revanth Reddy).. నువ్వు తీసుకొచ్చిన మార్పు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు.
దిశ, వెబ్ డెస్క్: ఇదేనా రేవంత్(CM Revanth Reddy).. నువ్వు తీసుకొచ్చిన మార్పు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. అప్పుల బాధతో ఆటో డ్రైవర్(Auto Driver) ఆత్మహత్య(Scuicide) అని వచ్చిన వార్తపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి పురుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? అని, ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి, ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? అని దుయ్యబట్టారు. అంతేగాక రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న 12వేల సాయమేది? అని, రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? అని నిలదీశారు. అలాగే ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! అని, తెలంగాణను(Telangana) తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! అని చెబుతూ.. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు! అని వ్యాఖ్యానించారు.