TG Assembly: రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana Assembly Sessions) చివరి రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana Assembly Sessions) చివరి రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకంపై సుధీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇప్పటి వరకు రుణాలు తెచ్చుకోలేని రైతులంతా రుణాలు తెచ్చుకోవాలని ఆనాడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారని గుర్తు చేశారు.
డిసెంబర్ 9న ఒకే ఒక్క సంతకంతో ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఆ రైతులను నట్టేట ముంచేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వందకు వంద శాతం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver) అయిందని నిరూపిస్తే.. తాను స్పీకర్ ఫార్మాట్ (Speaker Format)లో రాజీనామా లేఖను స్పీకర్ అందజేస్తానని సవాల్ విసిరారు. అదేవిధంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా సీఎం సొంత జిల్లా కొండగల్‌లోని కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల సహా ఏ గ్రామానికైనా వచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. ఆ గ్రామాల్లో అందరికీ రుణమాఫీ అయిందని వారు చెబితే.. తాను ఏం చేయడానికైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు.