నన్నెందుకు తిడుతుండ్రు.. అల్లు అర్జున్ కాలు, కన్ను పోయిందా: సీఎం రేవంత్ రెడ్డి
డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 4న పుష్ప-2(Pushpa-2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేసుకొని.. పలువురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఈ కేసుల్లో ఏ1 గా ఉన్న హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. కాగా ఈ ఘటనపై నేడు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్(Serious) అయ్యారు. హీరో అల్లు అర్జున్ ఒక్క రోజు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లినందుకు.. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన్ను పరామర్శించి, నన్ను తిడుతున్నారని అన్నారు.
అలాగే ఈ ఘటనలో హీరో కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా.. ఎందుకు ఆయన్ను పరామర్శిస్తున్నారు. కానీ తొక్కిసలాటలో గాయపడిన బాలుడుని పరామర్శించేందుకు ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రాలేదని సభలో సీఎం ప్రశ్నించారు. అసలు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు(Film industry celebrities) ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదని.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకు మందు సీఎం(CM) మాట్లాడుతూ.. ఇక తెలంగాణలో టికెట్ల ధరల పెంపు ఉండదని.. ప్రీమియర్, బెన్ ఫిట్ షోలకు తాను అధికారంలో ఉన్నంతకాలం ఉండదని తేల్చి చెప్పారు.