KA Paul: కేటీఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్(BRS leader KTR) తప్పు చెస్తే ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) అన్నారు.

Update: 2024-12-21 09:34 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్(BRS leader KTR) తప్పు చెస్తే ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) అన్నారు. నల్గొండ ప్రెస్ క్లబ్(Nalgonda Press Club) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. నల్లగొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) సీఎం కాగల అర్హత ఉన్న వ్యక్తి అని అన్నారు. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆర్ఆర్ టాక్స్(RR Tax) వసూళ్లు చేస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసారని అన్నారు. అంతేగాక కేసీఆర్(KCR) కొడుకు కేటీఆర్ తప్పులు చెస్తే అరెస్టు చేయండి. కానీ రాజకీయ కక్షతో కాదని చెప్పారు. వందల మంది తప్పులు చేసారు.. మోసం చేశారు.. వాళ్ళను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు పాల్ ప్రశ్నించారు. ఇక ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) లాంటి మంచి నేత కూడా బీజేపీ(BJP)కీ సపోర్ట్ చేయడం బాధాకరమని అన్నారు. చివరగా తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థలకు(Local Body Elections) ఎన్నికలు జరగనున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కేఏ పాల్ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వాలని పాల్ కోరారు.

Tags:    

Similar News