తెలుగు సినీ ఇండస్ట్రీకి భారీ దెబ్బ.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో ఎఫెక్ట్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీపై పడింది.

Update: 2024-12-21 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో ఎఫెక్ట్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీపై పడింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇకపై ప్రీమియర్, బెన్‌ఫిట్ షోలకు పర్మిషన్ ఉండదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు అన్ని చిత్రాలకు అనుమతులు ఇచ్చామని, ఇకపై ఏ హీరో సినిమాకు కూడా బెన్‌ఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో తెలుగు ఇండస్ట్రీ కోట్ల రూపాయల్లో నష్టపోనుంది. బెన్‌ఫిట్ షోలకు అభిమానులు వేల రూపాయలను వెచ్చించి టికెట్లను బుక్ చేసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ కొంత మేర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తప్పంతా అల్లు అర్జున్‌దే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్ రూప్ కారులో అభివాదం చేస్తూ రావడంతోనే అభిమానులు ఒక్కసారిగా కారువైపు వచ్చారని.. ఇదే సమయంలో బౌన్సర్లు అభిమానులను నెట్టి వేయడంతోనే రేవతి, ఆమె కుమారుడు కిందపడిపోయారన్నారు. ఆ తొక్కిసలాటలో దురదృష్టవత్తు రేవతి చనిపోయిందని, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు.   

Read More : Pushpa 2 : తగ్గాల్సిందే పుష్పా..!

Tags:    

Similar News