శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్..
విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
దిశ, శంషాబాద్ : విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. చెన్నై నుండి పూణే వెళ్లాల్సిన (AI 555) ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులతో పూణే బయలు దేరింది. టేకప్ అయిన కొద్ది సమయానికి సాంకేతిక లోపం తలెత్తడంతో గమనించిన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని శంషాబాద్ విమానాశ్రయంకి దారి మళ్లించి సమాచారం అందించాడు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు ల్యాండింగ్ కి అనుమతించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.