పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఉన్న ఇల్లును కూల్చి వేసిన మున్సిపల్ అధికారులు

తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 లో గల మున్సిపల్ పార్కు స్థలంలో కొంత భాగం ఆక్రమించి ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.

Update: 2024-12-20 16:25 GMT

దిశ, తాండూర్ పట్టణం: తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 లో గల మున్సిపల్ పార్కు స్థలంలో కొంత భాగం ఆక్రమించి ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఎన్టీఆర్ కాలనీలోని పార్కు స్థలంలో హసీనా బేగం కు చెందిన ఇంటిని మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా విననందుకు ఆ ఇంటిని కూల్చి వేశారు. పార్కుకు ప్రహరీ గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. పార్కు స్థలాన్ని ఆక్రమించారని, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హసీనా బేగం మాట్లాడుతూ… తాను కష్టపడి నిర్మించుకున్న ఇల్లు అని, తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత తనే ఈ స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగిస్తానని చెప్పినా అధికారులు వినడం లేదని తెలిపారు. తనకు ఇద్దరూ కూతుర్లు ఉన్నారని ఎక్కడ నివసించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు తనను ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వేడుకొంది.


Similar News