అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : కేఎల్ఆర్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ డిమాండ్ చేశారు.

Update: 2024-12-20 12:16 GMT

దిశ, మహేశ్వరం : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ...అమిత్ షా ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బీజేపీ మత రాజకీయాల పార్టీ అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా రుజువు చేశారన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవ సమావేశాల్లో రాజ్యాంగం గురించి ప్రస్తావించిన ప్రతిసారి అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News