గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్…15 గ్రాముల గంజాయి స్వాధీనం
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించారు.
దిశ, బడంగ్ పేట్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...షక్కర్ గంజ్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ నసీర్ (38), షాహిన్ నగర్‌కు చెందిన సయ్యద్ మసూద్ (28)లు గత కొంత కాలంగా అక్రమంగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మొహమ్మద్ నసీర్, సయ్యద్ మసూద్‌లు షాహిన్‌నగర్ లో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా బాలాపూర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బాలాపూర్ పోలీసులు 15 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.