ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడిన యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం మహేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ,మహేశ్వరం: ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం మహేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...మహేశ్వరం గ్రామం పోచమ్మ బస్తీకి చెందిన ఎదిరే సాయికిరణ్ (21) హైదరాబాద్ నారాయణగూడ అవినాష్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయి కిరణ్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడని బంధువులు మృతుడి తల్లికి సమాచారం అందించడంతో మృతుడు తల్లి ఇంటికి చేరుకుంది. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి కిరణ్ మృతి చెందాడని బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.