అతని అందాన్ని చూస్తే పెళ్లి అవ్వకుంటే బాగుండు అనిపిస్తుంది.. యంగ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

యంగ్ హీరోయిన్ ఆనంది(Anandi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానికం’(Itlu Maredupalli Prajanikam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-12-21 04:09 GMT
అతని అందాన్ని చూస్తే పెళ్లి అవ్వకుంటే బాగుండు అనిపిస్తుంది.. యంగ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఆనంది(Anandi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం’(Itlu Maredumilli Prajanikam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’(Jambi Reddy), ‘శ్రీదేవి సోడా సెంటర్’(Sridevi Soda Centre) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో కోలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ స్టార్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంది.. అక్కినేని అఖిల్(Akkineni Akhil) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అఖిల్ అందాన్ని చూస్తుంటే నేను ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా దేవుడా అని అనిపిస్తుంది. పెళ్లి కాకపోయి ఉంటే కచ్చితంగా అతన్ని మ్యారేజ్ చేసుకునే దాన్ని’ అంటూ ఆనంది అఖిల్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ భామ పెళ్లి చేసుకుంది. ఈమెకు ఒక బేబీ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Full View

Tags:    

Similar News