Naga Manikanta AV: ఎలిమినేట్ అయ్యాక మణికంఠ  AV ని ప్లే చేయలేదు.. ఇలా జరగడం బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారి..!

ఆదివారం ఎపిసోడ్ లో మణికంఠ AV ని మాత్రం ప్లే చేయలేదు

Update: 2024-10-21 08:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎవరూ ఊహించని విధంగా సాగుతుంది. సాధారణంగా ప్రతీ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు మూడు నుంచి నాలుగు ఉంటాయి కానీ ఈ సీజన్ లో మనమెవ్వరం ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎక్కువ వచ్చారు. ఇక ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ మణికంఠ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. నాగ మణికంఠ స్వయంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ ని అడిగాడు. దీంతో నాగార్జున ఓటింగ్ తో సంబంధం లేకుండా నాగ మణికంఠను ఎలిమినేట్ చేసాడని వార్తలు వస్తున్నాయి.

ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో నాగ మణికంఠ, గౌతమ్ ఉండగా నాగమణికంఠ ముందుగా ఓపెన్ అయి వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే ఇంటి సభ్యులను కూడా నాగ్ అడగగా నాగమణికంఠని ఎలిమినేట్ చేయమని చెప్పారు. అలా ఇతను ఎలిమినేట్ అయ్యాడు.

ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అయిన వారి  AV ని తప్పకుండా స్టేజ్ పై ప్లే చేస్తారు. కానీ, ఆదివారం ఎపిసోడ్ లో మణికంఠ AV ని మాత్రం ప్లే చేయలేదు. ఇది ప్రేక్షకులకు అర్ధం కానీ ప్రశ్న లా మారింది. ఒక వేళ రీ ఎంట్రీ ఏం అయిన ప్లాన్ చేశారా అంటే.. అది కూడా స్పష్టత లేదు. మరి, అందరీ AV లు ప్లే చేసి ఇతనిది ప్లే చేయకపోవడానికి కారణం ఏంటో ఇంకా బయటకు రాలేదు. వారం ఓటింగ్ లెక్కల ప్రకారం మణికంఠ సేఫ్ అవ్వడంతో అతని AV ని ప్రిపేర్ చేసి ఉండకపోవచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంది. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News