Manchu Manoj: మల్టీ స్టారర్ మూవీ నుంచి మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్.. హైప్ పెంచుతున్న పోస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam).

Update: 2024-11-12 06:54 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam). మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో రానున్న ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుంది. ‘భైరవం’ మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌(Nara Rohit)కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.

తాజాగా, ఇందులోంచి మంచు మనోజ్(Manchu Manoj) ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో మంచు మనోజ్ పూర్తిగా బ్లాక్ డ్రెస్ ధరించి లుంగీ పైకెత్తి కట్టి కోపంతో వర్షంలో తడుస్తూ పవర్‌లుక్‌తో కనిపించారు. అయితే ఇందులో ఆయన గజపతి అనే పాత్రలో నటించనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ముగ్గురు హీరోలు నటిస్తున్న ‘భైరవం’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..