ప్రభుత్వ ఉద్యోగం మానేసిన ఈ యువకుడిని మెచ్చుకున్న గవర్నర్
దిశ, వెబ్ డెస్క్: మనలో పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ..made barren land a favorite destination center providing free food to 500 people
దిశ, వెబ్ డెస్క్: మనలో పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇందుకు చక్కటి ఉదాహరణ యూపీకి చెందిన యువకుడు. అతను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. అది సంతృప్తి ఇవ్వడంలేదంటూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి బాటపట్టాడు. ఆ సమయంలో అందరూ హేళన చేశారు. వాళ్లే ఇప్పుడే చప్పట్లు కొడుతున్నారు. అంతేకాదు.. కేంద్రమంత్రి, గవర్నర్ కూడా అతడిని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఘాజీపూర్ కు చెందిన సిద్ధార్థ్ ది నిరుపేద కుటుంబం. అందరి కంటే బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత రైల్వేలో ప్రభుత్వం ఉద్యోగం కూడా సంపాదించాడు. ఆ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. దీంతో అతను ఆ ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మొదటగా రెండు ఆవులను పెంచాడు. అయితే, ఇది చూసిన గ్రామస్తులు అతడిని చూసి ఇంత చదువుకుని ఆవు పేడ తీస్తున్నాడంటూ హేళన చేశారు. అయినా కూడా అతను పట్టించుకోలేదు. చేపల పెంపకం, మరికొన్ని ఆవులు పెంచుతూ మంచి లాభాలు సాధించాడు. ఇలా మెల్లమెల్లగా అతను అనుకున్నవిధంగా బాతుల పెంపకాన్ని కూడా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మేకలు, ఒంటెలు, గుర్రాలు పెంచటం, పాల ఉత్పత్తులు, మట్టి పాత్రలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నవిధంగా ముందుకెళ్లుతోంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మరోవైపు తనకున్న 2 ఎకరాల భూమిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాడు. మరోవైపు సేవా రంగంలోనూ ముందున్నాడు. రోజుకు 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు. అనాథ పిల్లలను కూడా అతను చదివిస్తున్నాడు. అతని సేవలను గమనించిన గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా అభినందించారు. ఇది చూసిన గ్రామస్తులు ఇప్పుడు వాహ్.. నువ్వు సూపర్ అంటూ ఈ యువకుడిని అభినందిస్తున్నారు.